Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పీఎఫ్ విత్ డ్రా చేస్తే పన్ను కట్టాలా.. నిబంధనలు ఏంచెబుతున్నాయంటే!

EPF PF Withdrawal Tax Implications Explained
Advertisement
  • పీఎఫ్ విత్ డ్రాను సులభతరం చేసిన కేంద్రం
  • డ్రా చేసుకునే ఆప్షన్ల సంఖ్య పెంపు
  • అత్యవసరమైతే తప్ప విత్ డ్రా చేయొద్దంటున్న నిపుణులు
Advertisement
ఉద్యోగ భవిష్య నిధి (ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్– ఈపీఎఫ్) లోని సొమ్మును విత్ డ్రా చేసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఈపీఎఫ్ ఆఫీసు దాకా వెళ్లాల్సిన అవసరంలేకుండా మొబైల్ ఫోన్ ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించింది. విత్ డ్రాకు ఉన్న పరిమిత ఆప్షన్లకు మరికొన్నింటిని జోడించింది. దీంతో పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడం ఈజీగా మారింది. అయితే, ఇలా విత్ డ్రా చేస్తున్న సొమ్ముకు పన్ను చెల్లించాలా.. అంటే అక్కర్లేదనే నిపుణులు చెబుతున్నారు. అయితే, భవిష్యత్ అవసరాల కోసం దాచుకునే ఈ సొమ్మును అత్యవసరమైతే తప్ప విత్ డ్రా చేయొద్దని కూడా వారు సూచిస్తున్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా నిబంధనలలో మార్పులు చేసింది.

విత్ డ్రా చేసిన మొత్తంపై పన్ను ఎప్పుడంటే..
ఉద్యోగంలో చేరిన ఐదేళ్లలోపు పీఎఫ్ నుంచి సొమ్ము విత్ డ్రా చేస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. ఉద్యోగం మారిన సందర్భాలలో రెండు సంస్థల్లో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పాత సంస్థలో వినియోగించిన పీఎఫ్ ఖాతాను కొత్త సంస్థకు బదిలీ చేసిన సందర్భంలోనే ఈ రూల్ వర్తిస్తుంది. కొత్త ఖాతా తెరిస్తే మళ్లీ మొదటి నుంచే లెక్కిస్తారు. ఈపీఎఫ్ లో యజమాని వాటా కింద జమ అయిన మొత్తంతో పాటు డిపాజిట్ పై వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి ఆదాయాన్ని బట్టి పన్ను శ్లాబు వర్తిస్తుంది. ఆదాయపు పన్ను శాఖకు పాన్ కార్డు వివరాలు సమర్పించకపోతే 34.60 శాతం టీడీఎస్ కట్ అవుతుంది.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం..
ఐదేళ్లకు మించిన ఈపీఎఫ్ ఖాతాల్లోని డిపాజిట్ మొత్తంలో రూ.1.50 లక్షల వరకు (పాత పన్ను విధానంలో) పన్ను మినహాయింపు పొందొచ్చు. కొత్త పన్ను విధానంలో కేవలం యజమాని వాటాపై మాత్రమే మినహాయింపు లభిస్తుంది. రెండు విధానాల్లోనూ ఈపీఎఫ్‌ ఖాతాలోని నగదు నిల్వలు, మెచ్యూరిటీ సొమ్ము పూర్తిగా పన్ను రహితం.
Advertisement
Advertisement
Employee Provident Fund
EPF withdrawal
PF withdrawal
Income Tax
TDS
Tax exemption
PF rules
Provident Fund
Employee benefits
Retirement planning

More Telugu News